శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రానికి విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ప్రజలు తరలిరావడం అధికార్లకు తలనొప్పిగా మారింది. ఆధార్ అప్ డేట్ కోసం ఆధార్ నమోదు కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. జిల్లాలో ఎచ్చర్లలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రానికి రణస్థలం, జి.సిగడాం, లావేరు, భోగాపురం మండలాలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులున్న నమోదు ప్రక్రియను కొనసాగిస్తామని తహసిల్దార్ రమణయ్య వివరించారు.
ఆధార్ కోసం ఆగాల్సిందే.. - srikakulam
శ్రీకాకుళం జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. పొరుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు క్యూలైన్లు కడుతుండటంతో అధికార్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజల కష్టాలు