మన లక్ష్యం.. మూడు వేల కోట్లు - p. venkateswarlu
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ పి వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. 2019-20 సంవత్సరంలో మూడు వేల కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించినట్లు లీడ్ బ్యాంక్ అధికారి తెలిపారు.
జిల్లాలో రైతులకు 2019-20 సంవత్సరంలో మూడు వేల కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ పి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రాత్రి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోకుండా బ్యాంకుల ద్వారా అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందించాలని ఆదేశించారు. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని 440 మహిళా సంఘాలకు రూ. 10 కోట్లు ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందిస్తామన్నారు. అలాగే 40 మంది స్వయం సహాయక పథకంలో రూ 80 లక్షలు వ్యాపారులకు రూ 33.75 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.