లాక్ డౌన్ కొనసాతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మద్యం షాపులు తెరిచిందని ప్రజాసంఘాల ఐక్య వేదిక, సీఐటీయు నాయకులు విమర్శించారు. జనావాసాల మధ్య మద్యం షాపు పెట్టడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారని తెలిపారు. మద్యం షాపులు ఎదుట వందల మంది బారులు తీరితే కరోనా విజృంభించదా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.
మద్యం కాదు…ఉపాధి కావాలి
జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ప్రజాసంఘాల ఐక్య వేదిక, సీఐటీయు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం పైడిభీమవరంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ మద్యం దుకాణాల ఎదుట ధర్నా నిర్వహించారు.
మద్యం కాదు…ఉపాధి కావాలి
కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి వెంటనే మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయానికి ఇస్తున్న ప్రాధాన్యత ప్రజల ఆరోగ్యాలకు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజలకు కావల్సింది మద్యం కాదని తిండి, ఉపాధి కావాలన్నారు.
ఇదీ చదవండి: మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ధర్నా