వంశధార-నాగావళి నదికి వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది.ఒడిశాలో కురుస్తున్న వర్షాలు...శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి వర్షాల ప్రభావంతో....గొట్టాబ్యారేజ్,తోటపల్లి వద్ద ప్రవాహం పెరిగింది.వచ్చిన నీటిని వచ్చినట్లు...అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.లక్ష క్యూసెక్కుల వరకు వరదనీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వంశధార నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని....అధికారులు సూచించారు.పరిస్థితిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా పర్యవేక్షిస్తోంది.
ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో నాగావళి నదిలో వరదనీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.వరద నీరంతా...విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.ప్రాజెక్టులోకి ప్రస్తుతం23వేల800క్యూసెక్కుల నీరు వస్తుండగా... 17వేల101క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.నాగవళి వరద కారణంగా..జియ్యమ్మవలస మండలంలోని ముంపు గ్రామమైన బాసంగి బీసీ కాలనీలోకి వరద నీరు ప్రవేశించింది.స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద3అడుగుల మేరకు నీరు చేరింది.గరుగుబిల్లి మండలం నాగురూ,ఉల్లిభద్ర,కొమరాడ మండలం పాతకళ్లికోట గ్రామాల్లో పంట పొలాలు మునిగిపోయాయి.