MP Rammohan Naidu On Special Status:రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే.. రాజీనామాలు చేసి రావాలని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు, తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు పోరాటాలు చేస్తుంటే.. సీఎం జగన్ ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారని ప్రశ్నించారు.
"ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు సభలో గట్టిగా మాట్లాడలేదు. చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయాలి. కేంద్రంపై సీఎం జగన్ ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు ?. సీఎం నటనను చూసి.. సినిమా వాళ్లూ నమస్కరించారు." -రామ్మోహన్ నాయుడు, తెదేపా ఎంపీ