ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మోదీ' కోసమే రైల్వేజోన్‌ - MODI

మోదీ సభ కోసమే రైల్వే జోన్‌ ప్రకటించారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. భాజపాకు స్వార్ధం తప్ప చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. వాల్తేరు డివిజన్‌ను కనుమరుగు చేస్తే అంగీకరించమని స్పష్టీం చేశారు.

మాట్లాడుతున్న రామ్మోహన్‌నాయుడు

By

Published : Feb 28, 2019, 1:22 PM IST

విశాఖలో మోదీ 3 గంటల సభ కోసమే రైల్వే జోన్‌ నిర్ణయం తీసుకున్నారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్‌నాయుడు...ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావిడిగా రైల్వే జోన్‌ ప్రకటించారని విమర్శించారు.

విశాఖ రైల్వే జోన్‌ ప్రకటనలో భాజపా స్వార్ధం తప్ప చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా కొత్త జోన్‌లో ఉండేలా చూడాలని కోరారు. ఏ కమిటీ నివేదిక ప్రకారం జోన్‌ విభజించారని ప్రశ్నించారు. రైల్వే జోన్‌ విషయంలో అన్నిరకాలుగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాల్తేరు డివిజన్‌ను కనుమరుగు చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

విశాఖ రైల్వే జోన్‌ కోసం 2014 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామన్న ఎంపీ... అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో లేవనెత్తిన విషయం గుర్తుచేశారు. రాష్ట్రాలకు ఒక్కో జోన్‌ ఇచ్చుకుంటూ పోవడం కుదరదని అవమానించారని చెప్పారు. ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తుంటే ఇవాళ హడావిడిగా ప్రకటించారని దుయ్యబట్టారు.

మాట్లాడుతున్న రామ్మోహన్‌నాయుడు

ABOUT THE AUTHOR

...view details