Minister Botsa: "వైకాపాను కాపాడుకోవాల్సిన బాధ్యత...అందరిపై ఉంది" - శ్రీకాకుళంలో జిల్లా స్థాయి సమావేశం మంత్రులు
Minister Bosta: కార్యకర్తలు పార్టీకి ఎంతో ముఖ్యమని... వారిని తొక్కేయకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని... నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రులు... పార్టీ బలోపేతంపై చర్చించారు.
Minister Bosta: వైకాపాని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలో కిందిస్థాయి నేతలతో పాటు కార్యకర్తల్ని తొక్కేయకూడదన్నారు. కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ బతకలేదన్నారు. వైకాపా హయాంలో ఎటువంటి అవినీతీ జరగలేదని.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పార్టీకి ఇబ్బందులు తప్పవని మంత్రి ధర్మాన ప్రసాదరావు కార్యకర్తలకు హెచ్చరించారు.