శ్రీకాకుళం జిల్లా జలుమూరు, సారవకోట మండలాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. ఆరోగ్య సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎనలేని పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. కొవిడ్ పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఆరోగ్య సిబ్బందికి మాస్కులు అందజేసిన మంత్రి ధర్మాన - శ్రీకాకుళం కరోనా వార్తలు
కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణలో వైద్యులు, వైద్య సిబ్బంది పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 2 మండలాల్లో వైద్య సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.
ఆరోగ్య సిబ్బందికి మాస్కులు అందజేసిన మంత్రి ధర్మాన