ETV Bharat / state

'డ్వాక్రా సంఘాలతో ధాన్యం కొనుగోలు చెయ్యాలి' - వైకాపాపై దేవినేని ఉమ కామెంట్స్

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతీ పేదకుంటుంబానికి రూ.5 వేలు ఆర్థికసాయం అందించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అలాగే మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించాలని కోరారు. గతంలో తెదేపా ప్రభుత్వం చేసిన విధంగా డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించాలన్నారు.

Devi neni uma
మాజీ మంత్రి దేవినేని ఉమ
author img

By

Published : Apr 19, 2020, 11:29 AM IST

ప్రభుత్వంపై దేవినేని విమర్శలు

కరోనా వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ప్రతీ పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. జి.కొండూరు మండలంలోని చెరువు మాధవరం, చేగిరెడ్డిపాడు, కందులపాడు, ముత్యాలంపాడు, ఆత్కూరు గ్రామాల్లో, ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గుంటుపల్లి గ్రామాల్లో తెదేపా కార్యకర్తలు నిత్యావసరాలు పంపిణీ చేశారన్నారు. మూడు నెలలకు సరిపోయేలా నిత్యవసరాలు అందించి, ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

శాఖల మధ్య సమన్వయం లేదు

డ్వాక్రా సంఘాల ద్వారా గతంలో ధాన్యం కొనుగోలు చేయించామన్న ఉమా... ప్రభుత్వం ఇప్పుడా పని ఎందుకు చేయించలేకపోతుందని నిలదీశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలా జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి డ్వాక్రా సంఘాల ద్వారా మామిడిని కొనుగోలు చేయించాలని కోరారు.

ఇదీ చదవండి:

టచ్​ పాయింట్లు తగ్గించి.. ఆన్​లైన్ లావాదేవీలు పెంచాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.