ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పనులు చేయించుకుంటున్నారు.. బిల్లులు ఇవ్వడం లేదు'

By

Published : Sep 8, 2020, 10:43 PM IST

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన సొంత నియోజకవర్గం నరసన్నపేట పరిధిలో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలను8 వైకాపా నేతలు మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. పలు నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

minister  dharmana krishna das
minister dharmana krishna das

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన సొంత నియోజకవర్గం నరసన్నపేట పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పలువురు వైకాపా నేతలు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి నిర్మాణాల్లో అంచనాలకు మించి ఖర్చు చేయిస్తున్నారని, వాటి బిల్లులు ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని తెలిపారు.

ఏదో ఒక కారణం చెప్పి పనులు చేయకుండా నాన్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశధార కాలువల ద్వారా చివరి భూములకు సాగునీరు అందడం లేదని మరికొందరు మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. నియోజకవర్గంలో అధికారుల తీరు మెరుగుపడాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని మంత్రి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details