గుజరాత్ నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న మత్స్యకార వలస కార్మికులను నరసన్నపేటలోని మూడు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రతి ఒక్కరి నుంచి 3500 రూపాయల వంతున వసూలు చేశారని వలస కార్మికులు వాపోయారు. వీరిలో ఇద్దరికీ జ్వరం, ఆయాసం, జలుబు తదితర లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక పునరావాస కేంద్రంలో 149 మంది వలస కార్మికులు చేరగా... వారిలో ఇద్దరికి ఈ లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
ఎన్నో కష్టాలను ఎదుర్కొని సొంత గూటికి చేరారు - corona news in srikakulam dst
కేంద్ర ప్రభుత్వం చొరవతో... వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. గుజరాత్లో చిక్కుకున్న వలస కార్మికుల దగ్గరినుంచి 3500 చొప్పున అక్కడి అధికారులు తీసుకున్నారని మత్య్సకారులు వాపోయారు. మరోవైపు జిల్లాకు చేరిన వలస కూలీల్లో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

migrate workers reached to srikakulam dst from gujarath