ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆపదలో అండగా.. వలస కూలీలు మానవత్వం చాటగా!

పొట్ట కూటి కోసం భర్త గుజరాత్ కు వలస వెళ్లాడు. కరోనా కారణంగా ఉపాధి లేక.. తిరిగి వచ్చాడు. క్వారంటైన్ లో ఉన్నాడని తెలిసుకున్న భార్య... అతన్ని చూసేందుకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై.. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. చికిత్సకు 3 లక్షలు అవసరమయ్యాయి. భర్త చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుడే.. తోటి వలస కార్మికుల్లో మానవత్వం పరిమళించింది. మేమున్నామంటూ...అంతా తలో చేయి వేసి విరాళాలు సేకరించారు. బాధితుడికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే..

By

Published : May 10, 2020, 12:08 PM IST

Published : May 10, 2020, 12:08 PM IST

Migrant laborers suport to accident person
ఆపద సమయంలో అండగా నిలిచిన వలస కూలీలు

గుజరాత్​లోని మంగుళూరు నుంచి వచ్చిన ఐదు వేల మంది మత్స్యకార వలస కార్మికులు... జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లో వసతి పొందుతున్నారు. వీరిలో ఒకరైన గణ గళ్ళ కూర్మారావు రణస్థలంలో ఏర్పాటు చేసిన పునరావాసంలో ఉన్నారు. భర్త వచ్చాడని తెలుసుకున్న ఇతని భార్య లక్ష్మి.. రణస్థలం వచ్చింది. భర్తను చూసి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు అత్యవసరంగా శాస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్​లో ఉన్న వలస కార్మికులు.. మానవత్వంతో స్పందించారు. మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తోటి వలస కార్మికుడికి సంఘీభావం తెలుపుతూ విరాళాలు సేకరించారు. నరసన్నపేట బాలికల వసతి గృహంలో ఉన్న నలభై ఒక్క మంది వలస కార్మికులు పదివేల రూపాయలు విరాళంగా సేకరించారు. అలాగే మరో మూడు పునరావాస కేంద్రాల్లో కార్మికులంతా విరాళాలు సేకరిస్తున్నారు. సహచర కార్మికుడుకి కష్ట కాలంలో ఆదుకునేందుకు తామున్నామంటూ భరోసా నిస్తున్నారు.

ఈ విరాళానికి తోడు.. ప్రభుత్వం కానీ.. దాతలు కానీ స్పందిస్తే.. ఆమె కోలుకునే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

వలస కూలీలకు కరోనా.. ఇచ్ఛాపురం సరిహద్దుల్లో ఆందోళన

ABOUT THE AUTHOR

...view details