శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దొంగవాడి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని కోరారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ఎంపీపీ సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఎంపీడీవో జగన్ తదితరులు పాల్గొన్నారు.
" చెత్త నుంచి సంపదను సృష్టించాలి " - srikakulam
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని పాతపట్నం ఎంపీపీ సుజాత... అధికారులను కోరారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం