జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి వద్ద దళిత సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో దళితలపై దాడులు జరుగుతుంటే నిరసన తెలుపుకునే హక్కు కూడా లేదా..? అని ప్రశ్నించారు. పోలీసుల చర్యకు నిరసనగా దళితులు, వామపక్షాల నేతలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు.
'దళితులపై దాడులు జరుగుతుంటే నిరసన తెలుపుకునే హక్కు లేదా.. ?' - జగన్ పై కూన రవికుమార్ ఫైర్
శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి వద్ద దళిత సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటంపై తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవం, హక్కుల పట్ల పోలీసులు వ్యహరించిన తీరు చాలా బాధాకరమన్నారు.
'దళితలపై దాడులు జరుగుతుంటే నిరసన తెలుపుకునే హక్కు లేదా ?'