రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యాశాఖ ఇష్టానుసారంగా సంతకాలు సేకరిస్తుందని తెదేపా నేత కూన రవికుమార్ పేర్కొన్నారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం విధానంపై తీర్పు రానున్న నేపథ్యంలో... సంతకం చేయలేని వారి నుంచి అధికారులు వేలిముద్రలు సేకరిస్తున్నారన్నారు. హైకోర్టు తీర్పునకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని శ్రీకాకుళంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఆంగ్లమాధ్యమంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వస్తే... గ్రామ సభలు నిర్వహించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
'ఆంగ్లమాధ్యమం విధానంపై విద్యాశాఖ వైఖరి సరికాదు'
ఆంగ్లమాధ్యమం విధానంపై విద్యాశాఖ వైఖరిని తెదేపా నేత కూన రవికుమార్ తప్పుబట్టారు. ఈ విధానంపై హైకోర్టులో తీర్పు రానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇష్టానుసారంగా సంతకాలు సేకరిస్తున్నారని ఆరోపించారు.
ఆంగ్లమాధ్యమం విధానంపై కూనరవికుమార్ వ్యాఖ్యలు