ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీకాకుళంలో గరళకంఠుని నామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

By

Published : Nov 30, 2020, 1:17 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలు, భోళాశంకరుడి నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ ప్రాంగణాల్లో కొవిడ్​ నిబంధనలు పాటించే విధంగా ఆలయ కమిటీలు చర్యలు తీసుకుంటున్నాయి.

karthika pavurnami celebrations
గరళకంఠుని నామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శ్రీకాకుళం జిల్లాలో శివాలయాలు, గరళకంఠుని నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. నేడు కార్తిక మాస మూడవ సోమవారం, పౌర్ణమి ఘడియలు కావటంతో ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకొని అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.

నరసన్నపేట...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో కార్తిక సోమవారం పురస్కరించుకొని భక్తుల తాకిడి పెరిగింది. వేకువ జాము నుంచే ఆలయంలో ప్రత్యేక దర్శనాలు నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ... భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

టెక్కలి...

టెక్కలి మండలం రావివలస గ్రామం లోని ఎండల మల్లికార్జున స్వామి శివక్షేత్రం భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకొని శీర్షాభిషేక చేశారు. ఆలయంలో భక్తుల తాకిడి పెరగటంతో పోలీసు శాఖ బందోబస్తును నిర్వహించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా కార్తిక పౌర్ణమి

ABOUT THE AUTHOR

...view details