ప్రజలు ఇచ్చిన అధికారాన్ని.. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించకుండా ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. పత్రికల నోరు నొక్కే ప్రయత్నం చేయకూడదన్న కళా వెంకట్రావు.. అసెంబ్లీ సమావేశాలను కొన్ని టీవీ ఛానళ్లలో నిలుపుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైకాపా పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఇప్పటికైనా వైకాపా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
'మీడియాను నియంత్రించడం అప్రజాస్వామికం'
రాష్ట్రంలో వైకాపా అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రతిపక్షనేతలను అసెంబ్లీలోకి రానీకుండా గేట్లు మూసివేయడంపై ఆయన మండిపడ్డారు. ఆ ఘటన జగన్ పాలనలో... ఓ చీకటి రోజు అన్నారు. శాసనసభ సమావేశాలు ప్రసారం చేయకుండా కొన్ని మీడియా సంస్థలను నియంత్రించడం సరికాదని కళా అభిప్రాయపడ్డారు.
కళా వెంకట్రావు
ఇదీ చదవండి :