తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చేస్తున్న దాడులను తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. తమ నేతలపై చేస్తున్న దాడులు కక్షపూరిత చర్యని ఆయన తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు చేసిన దాడుల్లో ఆరుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని దాడులను ఆపాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అశోక్ పై దాడి జరుగుతున్నా.... పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వమే పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కక్షపూరిత చర్యలు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పై చేస్తున్న దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
'వైకాపా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది'
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నేతలపైన వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులను కక్షపూరిత చర్యగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తెలిపారు.
'మాపై వైకాపా చేస్తున్నవి కక్షపూరిత చర్యలు'