తోట నరసింహానికిలేఖ
'ఏ1 ముద్దాయి వలలో తోట' - బహిరంగలేఖ
''జగన్ అవినీతి రాజ్యస్థాపనలో తోట నరసింహం భాగమవుతున్నారు. 2014లో తెదేపా బలంతో గెలిచిన ఆయన పార్టీకే ద్రోహం తలపెట్టారు. వైకాపాలో చేరి ఏ1 ముద్దాయిల పక్షాన తోట నిలవడం బాధాకరం'' -కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తోట నరసింహం వైకాపాలో చేరారని మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్ వలలో... చిక్కుకున్నారంటూ తోటకు లేఖ రాశారు.అనారోగ్య కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉంటానన్న తోట నరసింహం.. పార్టీ ఎలా మారారని ప్రశ్నించారు. నరసింహం సతీమణికి ఎమ్మెల్సీ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపునకు బలాన్నిచ్చినపార్టీకే ద్రోహం చేశారన్నారు. కేవలం టిక్కెటు ఆశించే జగన్‌తో చేతులు కలిపారని విమర్శించారు. జగన్.. పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ, టిక్కెట్లను కోట్లతో తూకం వేస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రజల మద్దతున్న అభ్యర్థులకే తెదేపా సీట్లు ఇస్తుందని మంత్రి స్పష్టంచేశారు.