Nadendla Manohar visited Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంత్రి అప్పలరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలోని రాజధాని సమస్యపై కాకుండా.. మంత్రి అప్పలరాజు మెుదట తన జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు... ప్రతీ పీహెచ్‌సీలోనూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న జగన్, ఎం అయ్యాక ఆ హామీని ఎందుకు మర్చిపోయారని నాదెండ్ల మనోహర్ ఆక్షేపించారు. మంత్రి అప్పలరాజు విశాఖ రాజధాని కోసం కాకుండా.. తన నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చేందుకు పోరాడాలని ఎద్దేవా చేశారు. పలాస మండలం గొల్ల మాకన్నపల్లిలో కిడ్నీ రోగులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
'కిడ్నీ రోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. మందులు ధరలు పెరుగుతున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామి చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలు మరిచిపోయారు. స్థానిక నేత, ఇక్కడి మంత్రి రాజధాని కావాలి, అమరావతి మారాలి అంటూ, సభలు పెట్టడం కన్నా ఈ ప్రాంత ప్రజల సమస్యలపై స్పందిస్తే మంచిది. గతంలో ఇక్కడి ప్రజల సమస్యలు ప్రపంచానికి తెలపాలని పవన్‌కల్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించి వారి సమస్యలను అందరికి తెలిసేలా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను.'- నాదెండ్ల మనోహర్, జనసేన నేత