శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కనే పొదల్లో బుధవారం ఉదయం అప్పుడే పుట్టిన శిశువును స్థానికులు గుర్తించారు. కంబకాయ, గుండు వలస గ్రామాల నడుమ రోడ్లు భవనాల శాఖ రహదారి పక్కనే పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును విడిచి వెళ్లారు. రక్తపు మరకలతో ఉన్న ఆ పాప ఏడుపు చూసి అటుగా నడిచి వెళుతున్న వారు గుర్తించారు. వెంటనే ఆ చిన్నారిని నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం హస్పిటల్‌కు పంపించారు.
infant in bushes: పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు - Female baby
ఏమైందో ఏమో..అప్పుడే పుట్టిన ఆడశిశువును తల్లే పడేసిందో..లేక ఎవరైనా తీసుకొచ్చి పడేశారో తెలీదు కానీ.. ఆ పాప పొద్లలో కనిపించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ సమీపంలో జరిగింది. స్థానికులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు