శ్రీకాకుళం జిల్లాలో 33 శాతం ఉండవలసిన అటవీ సాంద్రత... ప్రస్తుతం 12 శాతం మాత్రమే ఉందనీ అటవీశాఖ అధికారి బలివాడ ధనుంజయరావు తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 2019 - 2020 ఏడాదికి గాను జిల్లాలో 60 లక్షలు మొక్కల పెంపకం చేపట్టామన్నారు. అందులో 40 లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కొబ్బరి, సరుగుడు, జీడి, సపోటా, నేరేడు, సీతాఫలం, టేకు, మరో 30 జాతులకు చెందిన మొక్కలు జిల్లాలో ఉన్న 91 సామాజిక వన నర్సరీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో మొక్కల పంపిణీ... రైతులకు ఉచితం - శ్రీకాకుళం జిల్లా
అటవీ సాంద్రత పెంపొందించటమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా అటవీశాఖ అడుగులు వేస్తోంది. రకరకాల మొక్కలను పెంచి రైతులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళిక చేసింది.
అందుబాటులోని మొక్కలను చూపిస్తున్న అధికారి
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 250 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నామని అన్నారు. దీంతోపాటు మొక్కలను జిల్లా రైతులకు ఉచితంగా అందిస్తామనీ ,మొక్కలు కావలసిన రైతులు నేరుగా నర్సరీలు వద్దకు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని వస్తే సరిపోతుంది చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో 9 లక్షలు మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.