శ్రీకాకుళంలోని పెద్దపాడు రహదారిలో ఉన్న ఓ ఆటో ఫైనాన్స్ కంపెనీలో చోరీ జరిగింది. ఉదయం తొమ్మిది గంటలకు విధులకు హాజరైన సిబ్బంది.. చోరీ జరిగినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం.. రూ. 38 లక్షలు నగదు అపహరణకు గురయినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమేరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా చోరీకు గురైనట్లు గుర్తించారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళంలో భారీ చోరీ.. ఆటో ఫైనాన్స్ సంస్థలో రూ.38 లక్షలు అపహరణ - శ్రీకాకుళం క్రైం న్యూస్
శ్రీకాకుళంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ఓ ఆటో ఫైనాన్స్ సంస్థ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.38 లక్షలు అపహరించారు.
దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు