శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలోని మండాపొలం కాలనీలో మోకాలు లోతు నీటిలో రాకపోకలు చేస్తున్నారు. భవాని నగర్, శ్రీనివాస నగర్ లో నీరు నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయకపోవడంపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టెక్కలిలో లోతట్టు ప్రాంతాలు జలమయం - srikakulam district latest news
టెక్కలి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
టెక్కలిలో లోతట్టు ప్రాంతాలు జలమయం