వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీర ప్రాంతంలో కొనసాగుతుండటంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, నరసన్నపేట, జలుమూరు, హిరమండలం, బూర్జ, ఎల్.ఎన్.పేటతో పాటు వివిధ మండలాల్లో తేలికపాటితో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండటంతో వాతావరణంలో చల్లదనం ఏర్పడింది. ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం కారణంగా ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం - heavy rain in Srikakulam district
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీర ప్రాంతంలో కొనసాగుతుండటంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం