శ్రీకాకుళం జిల్లా కవిటీలో ధాన్యం బస్తాల మధ్య గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. రూ.60 వేల విలువ చేసే ఖైనీ గుట్కాను ఒడిశా జయంతిపురం నుంచి ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి తరలిస్తుండగా కవిటి పోలీసులు పట్టుకున్నారు. శనివారం జాతీయ రహదారి కూడలి వద్ద తనిఖీలు చేపడుతున్న సమయంలో బొలెరో వాహనంలో ధాన్యం బస్తాల మధ్యలో ఖైనీ గుట్కా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.
GUTKA CAUGHT: ధాన్యం బస్తాల మధ్య గుట్కా తరలింపు.. ఇద్దరిపై కేసు నమోదు - Kaviti Police
శ్రీకాకుళం జిల్లా కవిటిలో ధాన్యం బస్తాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండగా ఖైనీ గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
ధాన్యం బస్తాల మధ్య తరలిస్తున్న గుట్కా