Two persons washed out: శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలోని కేదారిపురం ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వాన ధాటికి.. గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ప్రాంతంలోని వరహాల గెడ్డలో పడి కూర్మారావు, శంకర్ అనే ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం స్థానికులతో కలసి అధికారులు గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో గెడ్డ వద్దే గ్రామస్థులు ఉన్నా కాపాడే యత్నం చేయలేదు. బూర్జ మండల పరిధిలో రెండు రోజులుగా కురిసిన జోరు వానకు రెండు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. వంశధార కాలువకు గండి పడటం వల్ల.. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గుల్లలపాడు, తడివాడను ముంచెత్తాయి. పంట పొలాలు పూర్తిగా నీటిపాలయ్యాయి.
వంశధార కాలువకు గండి.. వరహాల గెడ్డలో ఇద్దరు గల్లంతు
Rains in Srikakulam: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత తగ్గిందని.. వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార కాలువకు గండి పడింది. వరహాల గెడ్డలో ఇద్దరు గల్లంతయ్యారు.
rains