మాజీ కేంద్రమంత్రి, తెదేపా నేత, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు 8వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నేతలు ఆయనకు ఘన నివాళులర్పించారు.
నిమ్మాడలో ఎర్రన్నాయుడు 8వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవాని, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్ని ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో... పట్టణంలోని కోర్టు కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, నవజీవన్ ఆశ్రమంలో బధిరులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా ప్రజలకు ఆయన విలువైన సేవలు అందించారన్నారు. అలాగే పార్టీ ప్రగతికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.