ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా మాజీ సర్పంచ్ దారుణ హత్య - శ్రీకాకుళం జిల్లా నేర వార్తలు

శ్రీకాకుళం జిల్లా కనుగులవాని పేటలో తెదేపాకు చెందిన మాజీ సర్పంచ్ కనుగుల కృష్ణారావు.. దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కనుగులవానిపేటలో తెదేపా మాజీ సర్పంచ్ దారుణ హత్య
కనుగులవానిపేటలో తెదేపా మాజీ సర్పంచ్ దారుణ హత్య

By

Published : May 13, 2021, 4:22 PM IST

శ్రీకాకుళం గ్రామీణ మండలం కనుగులవానిపేట గ్రామంలో తెదేపాకు చెందిన మాజీ సర్పంచ్ కనుగుల కృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన సవరరాజు అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణారావు ఈ ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు.

దగ్గరలో ఉన్న చెట్ల వద్ద కూర్చుని ఉండగా వెనుక నుంచి వచ్చి తలపై బలంగా దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై, సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details