The plight of fishermen: చూడచక్కని సముద్ర తీరం జాలర్ల చేపలవేటకు అనువైన ప్రాంతం. కానీ నడిసంద్రం వరకూ నావలపై వెళ్లే మత్స్యకారుల సందడి నేడు కానరావడంలేదు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దోనిపేట గ్రామం. పారిశ్రామిక కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. ఈ గ్రామానికి సమీపంలో బల్క్ డ్రగ్స్ తయారు చేసే 8 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. రోజూ వాటి నుంచి విడుదలయ్యే హానికరమైన వ్యర్థాలను భూగర్భ పైప్‌లైన్ ద్వారా సముద్ర జలాల్లోకి వదులుతున్నారు. దీంతో ధోనిపేటను ఆనుకోని ఉన్న సముద్రతీరం అంతా కలుషితమవుతోంది. ఈ కారణంగా మత్స్య సంపద అంతా కనుమరుగైపోతుంది.
దోనిపేట గ్రామంలో 225 మత్స్యకార కుటుంబాలు నివాసం ఉంటున్నా. ప్రస్తుతం 20 నుంచి 30 మంది మాత్రమే కనిపిస్తారు. మిగిలిన వారంతా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. పరిశ్రమలు పెట్టేటప్పుడు స్థానిక కోటా కింద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. తీరా పెట్టాక మడం తిప్పేశారు. వేటసాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు. చేతిలో డిగ్రీ ఉన్నా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు... వలస బాట పడుతున్నారు. తమ కష్టాలు పాలకులకు, అధికారులకు తెలిసినా. ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని మత్స్యకారులు అంటున్నారు.