ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కంబకాయలో అగ్ని ప్రమాదం.. ధాన్యం బస్తాలు దగ్ధం

By

Published : Jan 1, 2020, 3:55 PM IST

శ్రీకాకుళం జిల్లా కంబకాయలో జరిగిన అగ్నిప్రమాదం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సంవత్సరం మెుత్తం కష్టపడి పండించిన ధాన్యం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదవడం చూసిన అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

fire-in-srikakulam-district
కంబకాయలో అగ్ని ప్రమాదం

అగ్నిప్రమాదంలో దగ్ధమైన ధాన్యం బస్తాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ధాన్యం, గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన 8 మంది రైతుల ధాన్యం బస్తాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియలేదు. అయితే ఒకే కళ్లంలో యంత్రాలతో నూర్పిడి చేసి బస్తాలతో భద్రపరిచిన ధాన్యానికి అగ్ని కీలలు వ్యాపించాయి. గాలుల తీవ్రత కారణంగా అగ్ని మంటలు క్షణాల్లో వ్యాప్తి చెందాయని స్థానికులు తెలిపారు. ధాన్యం కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం వల్ల కళ్లంలోనే దాచుకున్నామని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details