శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రంగంపేట ఎన్.ఎస్.ఎల్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలడం వలనే మంటలు వ్యాపించాయని స్థానికులు అంటున్నారు. ప్రమాదంలో చెరుకుపల్లి రవణమ్మ, మామిడి కమలమ్మ, చెరుకుపల్లి అరుణ, మొత్తం దుర్గాప్రసాద్, బాబురావు జ్యోతి, పైడమ్మ, విజయలకు చెందిన ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని... మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదు పుచేశారు. కట్టుబట్టలతో నడిరోడ్డుపై పడ్డామని బాధితులు ఆవేదన చెందుతున్నారు. నిరుపేదలైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సంఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు.
అగ్నిప్రమాదంలో 11 ఇళ్లు దగ్ధం.. రోడ్డునపడ్డ బాధితులు - gas cylinder blast
అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
11 పూరిళ్లు దగ్ధం