శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాల కార్యక్రమాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు విత్తనాలు పూర్తి స్థాయిలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే అనేక సమస్యలు పరిష్కరించారని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు విత్తనాలు అందించాలని చెప్పారు. బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీటీసీ సభ్యురాలు బొడ్డేపల్లి సరోజమ్మతోపాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
"రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం" - welfare
రైతు సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని ఆమదాలవలస శాసన సభ్యుడు తమ్మినేని సీతారాం తెలిపారు. అన్నదాతల ప్రభుత్వం ఇస్తున్న రాయితీ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.
"రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం"