శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మద్యం దుకాణాల ఎదుట మందుబాబులు.. ఇవాళ కూడా షాపులు తెరవకముందే క్యూ కట్టారు. అందులో నిలుచున్నవారిలో కొందరు.. అప్పటికే మత్తులో ఉన్నారు. భౌతిక దూరం మాటే మరిచి.. లిక్కర్ కోసం తూలుతూ ఎదురుచూశారు.
పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నా మొండికేశారు. ఖాకీలకే చుక్కలు చూపించారు. మరోవైపు.. మద్యం అమ్మకాల కోసం దుకాణాల నిర్వాహకులు టోకెన్ల విధానాన్ని అమలు చేశారు. మధ్యాహ్నం 12 దాటినా షాపులు తెరవని కారణంగా.. ఎండను కూడా లెక్క చేయకుండా మందుబాబులు ఎదురుచూశారు.