శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం దూసి గ్రామంలో గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నీలమ్మతల్లి అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. అమ్మవారికి ఇంటింటా పసుపునీళ్లతో అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవతా ప్రతిమను దూసి గ్రామం నుంచి దూసిపేటకు తీసుకెళ్లి అక్కడ ఒక రోజు నుంచి అక్కడి నుంచి మళ్లీ గ్రామానికి తీసుకవచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. 3 రోజుల పాటు గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు గ్రామస్థులు తెలిపారు. దూరప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా గ్రామదేవత నీలమ్మతల్లి ఉత్సవాలు - poojalu
శ్రీకాకుళం జిల్లా దూసిలో గ్రామదేవతల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నీలమ్మతల్లి అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు.
గ్రామదేవత