ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న వస్తువులు అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటికి బియ్యం పంపిణీలో లబ్ధిదారులు వేలిముద్రల యంత్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.దీంతో బియ్యం పంపిణీని అనుకున్న సమయంలో చేయలేకపోతున్నామని వాలంటీర్లు చెపుతున్నారు.తక్షణమే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.ఆమదాలవలస పట్నంలో రెండవ వార్డు క్రిష్ణాపురం గ్రామంలో500మందికి వస్తువులు అందిచాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం50మందికి అందించారు.వేలిముద్రలు సేకరణలో కొన్ని సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతున్నాయని,వాటిని త్వరలో అధికమిస్తామని స్థానిక తహసీల్దార్ రాంబాబు చెప్పారు.
బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు,ప్రజల అసహనం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల మున్సిపాలిటీ పరిధిలో, పైలట్ ప్రాజెక్టు గా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయని వాలంటీర్లు వాపోతున్నారు.
సాంకేతిక సమస్యతో నిలిచిన పైలట్ పంపిణీ