శ్రీకాకుళం జిల్లా..టెక్కలి మండలం గూడెం గ్రామంలో కుక్కల దాడిలో జింక పిల్ల మృతి చెందింది. తాగు నీటి కోసం గ్రామానికి వచ్చిన జింక పిల్లపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ జింక పిల్లను గ్రామస్థులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకునే లోపే అది మృతి చెందింది. మృతి చెందిన జింకను అటవీశాఖ బీట్ అధికారి పరిశీలించారు. సమీప కొండలు, అటవీ ప్రాంతం నుంచి ప్రతి ఏడాది వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు గ్రామ సమీపంలోకి వచ్చి మృత్యువాత పడుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటివరకు నాలుగు జింకలు కుక్కల దాడిలో మృతి చెందినట్లు వారు తెలిపారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కుక్కల దాడిలో జింక పిల్ల మృతి..
తాగు నీటి కోసం గ్రామానికి వచ్చిన జింక పిల్లపై కుక్కలు దాడి చేయగా.. జింక పిల్ల మృతి చెందింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గూడెం గ్రామంలో జరిగింది. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకునే లోపే అది మృతి చెందింది.
కుక్కల దాడిలో జింక పిల్ల మృతి..