శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జిల్లా పారామిలటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి కృపావరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం జవాన్లు చేస్తున్న పోరాటాన్ని ఆయన కొనియాడారు.
పారామిలటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
దేశాన్ని రక్షించేందుకు సాయుధ బలగాలు నిరంతరం కృషి చేస్తున్నాయని జిల్లా అగ్నిమాపక అధికారి కృపావరం అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన జిల్లా పారామిలటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

పారామిలటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం
దేశాన్ని ప్రతి క్షణం రక్షించేందుకు సాయుధ బలగాలు చేస్తున్న కృషి గొప్పదని... విదేశీ శత్రువుల దాడుల్లో ఎందరో యోధులు ప్రాణాలు పోగొట్టుకున్నారని పలువురు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా మాజీ అధ్యక్షురాలు ధర్మాన పద్మప్రియ, అసోసియేషన్ ప్రతినిధి వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇద చూడండి:పార్లమెంటు సమావేశాల్లో అమరావతి గొంతుక వినిపిస్తా: ఎంపీ గల్లా