ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం' - ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎవరితో లాలూచీ పడే అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. మాకు ఎవరితో గొడవలు లేవు.. కానీ మా ప్రజలకు నష్టం కలిగే విధంగా చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

Deputy CM on TS Govt
రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో లాలుచీ పడదు.

By

Published : Jul 4, 2021, 10:37 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో లాలూచీ పడదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. మా రైతులు ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ వాళ్లు విద్యుత్​ ఉత్పత్తి చేయడం ఎంత వరకు సమంజసమని.. శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న తీరు అన్యాయమన్నారు. రాజకీయ లబ్దికోసం కొందరు తెలంగాణ మంత్రులు తొందరపాటుతో మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ మంత్రులు, నాయకులు ఇప్పటికైనా ఆలోచనతో, విచక్షణతో వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కోరారు.

ABOUT THE AUTHOR

...view details