తమ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైద్యం అందక ఎవరూ చనిపోకూడదనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సమాయత్తమవుతున్నామని తెలిపారు. ముఖ్యంగా గిరిజనులకు మేలైన వైద్యం అందించేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.