కొంగల కొలను కోటేరు బంధం... ఆహ్లాద భరితం - 25 acres water
సిక్కోలులోని కోటేరు బంధం చెరువు ఆహ్లాదాన్ని పంచుతోంది. కొంగల రాకతో సరికొత్త శోభను సంతరించుకుంటోెంది. అక్కడి నీటి బాతుల సందడి.. అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ సమీపంలోని ఈ చెరువును ట్యాంకు బండ్‌గా చేయాలనే ఆకాంక్ష అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
కొంగల కొలనుగా కోటేరు బంద చెరువు
కోటేరు బంద చెరువు పర్యాటకులను ఆకర్షిస్తోంది. చెరువు నిండుగా.... చక్కటి సోయగంతో, లయబద్ధంగా కదులుతున్నట్లు చేసే కొంగల విహారం అన్ని వర్గాలని అలరిస్తోంది. చేపలు ఉండటంతో వివిధ రకాల కొంగలు, నీటి బాతులు సందడి చేయడంతో మండు వేసవిలో 25 ఎకరాల చెరువు చూపరులను ఆకట్టుకుంటోంది. దీనికి దగ్గరలో సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ గ్రామ మార్గంలో ఉన్న చెరువును ట్యాంకు బండ్ తరహాగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.