పాలకొండలో సీపీఐ నాయకులు కవాతు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సీపీఐ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థులు డాక్టర్ డివిజి శంకరరావు, గంగులు రోడ్ షో నిర్వహించారు. ఈ కవాతులో సీపీఎం, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి లేని రాజ్యం కావాలంటే... తమను గెలిపించాలని కోరారు. శాసనసభ స్థానానికి కొడవలి గుర్తుకు, పార్లమెంట్ స్థానానికి గాజు గ్లాసుకు ఓటు వేసి... తమని గెలిపించాలని అభ్యర్థించారు.
ఇవి చూడండి...