శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ నివాస్ జేసీ చక్రధరబాబుతో కలసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేస్తామని చెప్పారు. శాసన సభ, పార్లమెంటుకు ప్రత్యేకంగా కౌంటింగ్ గదులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం తొమ్మిదిన్నర సమయంలో మొదటి విడత రౌండు పూర్తి కావచ్చునన్నారు. లెక్కింపు అధికారులకు, సిబ్బందికి పూర్తి స్ధాయి శిక్షణ అందించామన్నారు. వాస్తవ పరిస్ధితుల్లో లెక్కింపు విధానాన్ని నమూనా లెక్కింపు ప్రక్రియను మంగళ వారం నిర్వహించామని చెప్పారు.
గంటన్నర లోపు మొదటి విడత పూర్తి: కలెక్టర్ నివాస్ - srikakulam
శ్రీకాకుళం జిల్లా ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ నివాస్ తెలిపారు.
ఓట్ల లెక్కింపు