ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు శ్రీకాకుళంలో సీఎం పర్యటన - pathapatnam

ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన సీఎం... రేపు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో, మధ్యాహ్నం విజయనగరం జిల్లా సాలూరులో బహిరంగ సభలకు హాజరుకానున్నారు.`

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

By

Published : Mar 20, 2019, 2:31 PM IST

పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ మూర్తి
ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో పాతపట్నం శాసనసభ్యుడు కలమట వెంకటరమణమూర్తి... ఏర్పాట్లుపరిశీలిస్తున్నారు. మండల కేంద్రంలోని హెలిపాడ్ నుంచి రోడ్ షో చేసేప్రదేశం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల పాటు సీఎం కాన్వాయ్ వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా రహదారికి ఇరువైపులా అడ్డంకులు తొలగించడమే కాక అన్ని రకాల ఏర్పాట్లను సమకూరుస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

సీఎం షెడ్యూల్
రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాతపట్నం చేరుకుంటారు.

మధ్యాహ్నం12 గంటల వరకు పాతపట్నంలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12.15 గంటలకు ఆమదాలవలస చేరుకుంటారు.

రైల్వేస్టేషన్ మైదానంలో 12.30 గంటల నుంచి 1.30 వరకు బహిరంగ సభకు హాజరవుతారు.

విజయనగరం జిల్లా సాలూరు పర్యటనకు వెళ్తారు.

ABOUT THE AUTHOR

...view details