శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కోట దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. చిత్రకారుడు మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 35 మంది చిన్నారులు తమ చిత్రాలను ప్రదర్శించారు. పర్యావరణం, స్వచ్ఛ భారత్ వంటి అంశాలపై వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన - పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన
చిన్నారుల్లో చిత్రకళను వెలికితీసేందుకు పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. చిన్నారుల చిట్టి చేతుల... కుంచెలనుంచి జాలు వారిన చిత్రాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
పాలకొండలో మండల స్థాయి చిత్రకళా ప్రదర్శన
TAGGED:
పాలకొండ