Chain Snatching: శ్రీకాకుళంలో చైన్ స్నాచర్లు బరితెగించారు. సూర్యమహల్ ఎదురుగా.. ఓ మహిళ మెడలో నుంచి 11 తులాల బంగారం లాక్కెళ్లారు. స్థానికురాలైన రాధ తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... వెనుక నుంచి మరో బైక్‌పై వచ్చిన దొంగలు మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడు, బంగారు చైన్ చోరీ చేశారు. ఆ తర్వాత క్షణాల్లో బైక్‌పై జారుకున్నారు. చోరీ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
Video: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్
Chain Snatcher: శ్రీకాకుళంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సూర్య మహల్ ఎదురుగా..ఓ మహిళ మెడలో నుంచి 11 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా..పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు