ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా సమావేశంలో గందరగోళం

రాష్ట్ర భాజపాలో ఇంటి రచ్చ వీధికెక్కింది. పార్టీకి సేవలందించినా సీటు దక్కలేదన్న ఆవేదనతో ఆశావహులు... సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలోనే ఒకరినొకరు దూషించుకుంటూ వాగ్వాదానికి దిగారు.

ఆందోళన చేస్తున్న భాజపా నేతలు

By

Published : Mar 21, 2019, 12:15 AM IST

భాజపా సమావేశంలో రసాభాస
శ్రీకాకుళంలో భాజపా రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇంఛార్జి సోము వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశం రసాభాసగా మారింది.సీట్ల కేటాయింపుపై భాజపా నేతలు ఘర్షణకు దిగారు. పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉంటున్న వారికి కాకుండా కొత్తగా వచ్చినవారికి సీట్లు కేటాయించడంపై నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇష్టానుసారంగాసీట్లు కేటాయిస్తున్నారని కొంతమంది నేతలు ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details