దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి సంఘీభావంగా శ్రీకాకుళంలో ద్విచక్ర వాహనలతో ర్యాలీ చేపట్టారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. అఖిల భారత కిసాన్ సంఘర్షణ్ కో-ఆర్డినేషన్ శ్రీకాకుళం జిల్లా కమిటీతో పాటు వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించుకుందని వారు మండిపడ్డారు.
రైతులకు మద్దతుగా శ్రీకాకుళంలో ద్విచక్ర వాహన ర్యాలీ
దిల్లీలో అఖిల భారత కిసాన్ సంఘర్షణ్ కో- ఆర్డినేషన్ కమిటీ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి సంఘీభావంగా శ్రీకాకుళంలో ద్విచక్ర వాహనాలతో రైతు సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళంలో ద్విచక్ర వాహనర్యాలీ