శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. కిడిసింగి-వజ్రపుకొత్తూరు మధ్య జీడి, కొబ్బరితోటల్లో పనిచేస్తున్న 6మంది రైతులపై ఎలుగుబటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వజ్రపుకొత్తూరుకు చెందిన అప్పలస్వామి, పురుషోత్తం, చలపతి, షణ్ముఖరావు, సంతోష్, తులసీదాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎలుగుబంటి దాడిలో ఐదు పశువులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి.
తోటలోకి దూసుకొచ్చి.. ఆరుగురు రైతులపై ఎలుగుబంటి దాడి! - శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి బీభత్సం
BEAR ATTACK : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో స్థానికులు, పశువులపై విరుచుపడింది. ఎలుగుబంటి దాడిలో ఆరు మంది రైతులు, ఐదు పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎలుగుబంటి దాడితో గ్రామంలో భయాందోళన పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ విషయంపై మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. నిన్న కూడా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి దాడిలో కోదండరావు అనే వృద్ధుడు చనిపోయాడు. వరుసగా రెండో రోజూ కూడా ఎలుగుబంటి దాడి చేయడంతో....స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగు బంట్ల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. ఎలుగు బంటి దాడికి గురైన వారిలో ఎక్కువ మంది సైనికోద్యోగులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :