Bad Condition of Govt Hostels:పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామంలో ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలురు వసతిగృహం శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్నా పట్టించుకునే నాధుడే లేడంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతిగృహం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి ఊచలు వేలాడుతుండడంతో భవనం ఎప్పుడు కూలిపోతుందో అని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
Lack of Facilities in SC Boys Welfare Hostels: శిథిలావస్థకు చేరిన వసతి గృహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70మంది విద్యార్థులున్న వసతి భవనంలో మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంపై పెచ్చులూడి తమపై పడతున్నాయని, నిద్రించే సమయంలో చాలాసార్లు తమపై పెచ్చులూడి పడిపోయాయి అంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహ పరిస్థితిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని హాస్టల్ వార్డెన్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన వసతి గృహం నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Minister Meruga on hostels: "అవును.. వాటి పరిస్థితి బాగా లేదు".. మంత్రి మేరుగ కీలక వ్యాఖ్యలు
Students Facing Problems with Dilapidated Hostels: వసతి గృహం శిథిలావస్థకు చేరి మూడేళ్లు గడుస్తున్నా అధికార యంత్రాంగం కనీసం స్పందించిన దాఖలు లేవంటూ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 మంది విద్యార్థులున్న ఈ వసతి గృహంలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగాలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు. వర్షం వస్తే గదిలో నీరు కారడంతో పాటు భోజనం చేసేటప్పుడు పైకప్పు నుంచి పెచ్చులూడి పడుతున్నాయంటూ వాపోయారు.